అనుమతిలేని బాణసంచా తయారీదారులపై చర్యలు
ABN , First Publish Date - 2020-10-28T08:13:39+05:30 IST
జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా సరే అనుమతి లేకుండా బాణసంచా తయారు చేసినా, విక్రయాలు జరిపినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అగ్నిమాపక శాఖా ధికారి ఏవీ.శంకరరావు హెచ్చరించారు.

జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శంకరరావు
ఏలూరు కార్పొరేషన్, అక్టోబరు 27 : జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా సరే అనుమతి లేకుండా బాణసంచా తయారు చేసినా, విక్రయాలు జరిపినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అగ్నిమాపక శాఖా ధికారి ఏవీ.శంకరరావు హెచ్చరించారు.తన చాంబర్లో మంగళ వారం ఆయన మాట్లాడారు. జిల్లాలో 24 మంది బాణ సంచా తయారు చేయడానికి లైసె న్స్లు కలిగి ఉన్నార న్నారు.బాణసంచా తయారీలో నిబంధనలకు అనుగుణ ంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 14 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నాయని మరో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపా దనలు ప్రభుత్వానికి పంపామన్నారు. పోలవరం, ఉండి, ఉంగుటూరు, దెందులూరు, కుక్కునూరు కేంద్రాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పా టుకు ప్రభుత్వ అనుమతి రావాల న్నారు.ఆయన వెంట సహాయ అగ్నిమాపక అధికారి పిఎస్ నాయుడు, ఏలూరు అగ్నిమాపక అధికారి రామకృష్ణ తదితరులు ఉన్నారు.