అయ్యో...రొయ్య

ABN , First Publish Date - 2020-10-28T08:04:36+05:30 IST

వాతావరణంలో ఏర్పడిన పెను మార్పులతో రొయ్యసాగుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గత నెల రోజులుగా వర్షాలు అడపాదడపా ఎండలతో ఆక్వా రంగం తీవ్ర ప్రభావానికి గురవుతుంది.

అయ్యో...రొయ్య

 ప్రతికూల వాతావరణం 

 తేలిపోతున్న రొయ్యలు 

 కష్టాల్లో ఆక్వా సాగు

 తెగుళ్లతో రైతులు సతమతం


గణపవరం, అక్టోబరు 27 : వాతావరణంలో ఏర్పడిన పెను మార్పులతో రొయ్యసాగుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గత నెల రోజులుగా వర్షాలు అడపాదడపా ఎండలతో ఆక్వా రంగం తీవ్ర ప్రభావానికి గురవుతుంది. రొయ్యలకు ప్రాణాంతకంగా మారింది.ఆక్సిజన్‌ అందక రొయ్యలు తేలిపోతున్నాయి. తెగుళ్లు సోకి రొయ్యలు చనిపోతు న్నాయి.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 70 శాతం మాత్రమే రొయ్య సాగు జరుగుతోంది. వాతావరణ మార్పుల నేప థ్యంలో 30 శాతం మంది రైతులు రొయ్య సాగు వెన కడుగు వేశారు.దీంతో సాగు తగ్గుముఖం పట్టింది. రొయ్యల చెరువుల్లో సెలనిటీ శాతం 30 పీపీగా ఉండ వచ్చు.వాతావరణం వల్ల సగానికి పైగా పడిపోవడంతో రొయ్యలు వైరస్‌ బారిన పడుతున్నాయి.


చెరువులో వేసిన రొయ్యలు నెలరోజుల్లోనే చనిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతు న్నారు.నష్టాలు చూస్తున్న రైతులు వాతావరణం మారేంతవరకు రొయ్య సాగు చేపట్టరాదంటూ క్రాప్‌ హాలిడేని ప్రకటిస్తున్నారు.ప్రస్తుతం చెరువుల్లోని వనమి రొయ్యను రక్షించేందుకు నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ శ్రమించాల్సి వస్తుంది. అయినప్పటికి కొన్ని చెరువుల్లో వైరస్‌ వచ్చి దెబ్బతిని నష్టపోతున్నారు. ప్రస్తుతం కౌంట్‌ రొయ్య దాదాపు తగ్గిపోతుంది. ఇలాంటి వాతావరణం ఇంకా ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పడంతో కొత్త సాగుకు రైతులు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిం చడం లేదు.నూతన సాగు చేపట్టిన రైతులు  ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 100 కౌంట్‌ లోపు ఉన్న రొయ్యలు కూడా చెరువుల్లో కనిపిం చడంలేదు.ఈ నేపథ్యంలో తెగుళ్ల నివారణకు అధిక వ్యయంతో మందులు వినియోగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పంటను కాపాడుకోలేక రైతులు పట్టుబడులు పట్టి అయినకాడికి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-10-28T08:04:36+05:30 IST