మహిళలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే బాలరాజు
ABN , First Publish Date - 2020-10-27T09:28:37+05:30 IST
మహిళలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే బాలరాజు

కొయ్యలగూడెం, అక్టోబరు 26 : వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ కరాటం సీతాదేవి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా బాలరాజుతో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు హాజరయ్యారు. అతిరాస కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కరరావు, ఏడు మండలాల వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.