జై.. దుర్గమ్మ

ABN , First Publish Date - 2020-10-27T09:25:33+05:30 IST

శరన్నవరాత్రులు ఈనెల 17వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభమై ఆదివారం రాత్రి శమీ పూజతో ముగిశాయి రెడ్డిగణపవరంలో దుర్గమ్మను ఆదివారం మహిషాసురమర్దినిగా అలంకరిం చారు.

జై.. దుర్గమ్మ

ముగిసిన శరన్నవరాత్రులు 

ఘనంగా విగ్రహాల నిమజ్జనాలు, గ్రామోత్సవాలు 


బుట్టాయగూడెం, అక్టోబరు 26 : శరన్నవరాత్రులు ఈనెల 17వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభమై ఆదివారం రాత్రి శమీ పూజతో ముగిశాయి రెడ్డిగణపవరంలో దుర్గమ్మను ఆదివారం మహిషాసురమర్దినిగా అలంకరిం చారు. ఆలయ ధర్మకర్త భౌమరాజు ధనుంజయరాజు దంపతులు ప్రత్యేక పూ జలు జరిపారు. రామన్నగూడెం రామాలయ ప్రాంగణంలో బీజేపీ నేత సోము హరినారాయణ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వ హించారు. సోమవారం అమ్మవారి విగ్రహ నిమజ్జనం నిర్వహించారు. 


జీలుగుమిల్లి : శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా జీలుగుమిల్లిలో జగదాంబ అమ్మవారిని పుష్పాలతో ఆదివారం అలంకరించారు.  మహిళలు కుంకు మ పూజలు, ముత్తయిదువు, గోపూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ చాట్రాతి భవానీశేఖర్‌, సభ్యులు  పాల్గొన్నారు.


 పోలవరం : పోలవరంలో దసరా ఉత్సవాల ఊరేగింపులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పాతపోలవరం, కృష్ణారావుపేట, రామయ్యపేట తది తర ప్రాంతాల్లోని అమ్మవారి విగ్రహాలను ట్రాక్టర్లపై మేళతాళాలు, గరగ నృ త్యాలు, తీన్మార్‌ డప్పులతో ఊరేగించారు. కార్యక్రమంలో పాతపోలవరం, రామ య్యపేట, కృష్ణారావుపేట, బంగారమ్మపేట, కొత్తపట్టిసీమ, ఆలయ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.


కామవరపుకోట :  కామవరపుకోట రామాలయం, వీరభద్రస్వామి ఆల యం, హయగ్రీవ పీఠం, జీలకర్రగూ డెం, కళ్ళచెరువు, గండిగూడెంలలోని కనకదుర్గాదేవి అమ్మవార్ల ఆలయం,  తడికలపూడి వాసవీ కన్యకాపరమేశ్వరి, ఆడమిల్లిలోని శనీశ్వరాల యంలో శరన్న వరాత్రు లు ఘనంగా ముగిశాయి.


దేవరపల్లి : శరన్నవ రాత్రి ఉత్సవాల ముగిం పు సందర్భంగా సోమవా రం  ప్రత్యేకంగా అలంక రించిన వాహనంలో దుర్గ మ్మవారిని ఊరేగించారు. మేళతాళాలతో బాణసం చా కాల్పులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవరపల్లి ఊరచెరువులో నిమజ్జనం చేశారు.

 

చాగల్లు : విజయదశమి ఉత్సవాల ముగింపు సందర్భంగా విచిత్ర వేషాలు, మేళతాళాలతో అమ్మవారిని వైభవంగా ఊరేగించారు. స్థానిక పాటెమ్మ పేటలో ఏర్పాటు చేసిన బాల కనకదుర్గమ్మ ఊరేగింపు వేడుకగా జరిగింది. స్థానిక సరస్వతీదేవి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిగాయి. చిక్కాలపాలెంలోని గార్లమ్మ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. 


తాళ్లపూడి : శరన్నవరాత్రులు మండలంలో ఘనంగా ముగిశాయి. ఆదివారం మంత్రి తానేటి వనిత తాళ్లపూడి ఆలయానికి విచ్చేసి పూజలు చేశారు. పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వాహకుడు నీలి సూర్యనారాయణ సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. 


చింతలపూడి : శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా సోమవారం గ్రామోత్సవాలు నిర్వహించారు. స్థానిక విశ్వనాథ మఠం, వేగిలింగేశ్వరస్వామి ఆలయం, షిర్డీ సాయి మందిర్‌లలో గ్రామోత్సవాలు, కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 


కొవ్వూరు : విజయదశమిని పురస్కరించుకుని గోష్పాదక్షేత్రంలోని బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో శమీ పూజ నిర్వహించారు. సంస్కృత పాఠశాలలోని శివాలయం లో లలితా పార్వతీ దేవికి, ఆర్య వైశ్య కల్యా ణ మండపంలో వాసవీ కన్యకా పరమేశ్వరికి, పట్టణ, మండలంలోని దుర్గాదేవి ఆలయాల్లో  కనక దుర్గమ్మ అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-10-27T09:25:33+05:30 IST