ధాన్యం కొనుగోలుకు సిద్ధమవండి

ABN , First Publish Date - 2020-10-13T10:10:24+05:30 IST

ఖరీఫ్‌ ఽధాన్యం కొను గోలుకు అవసరమైన బ్యాంకు గ్యారెంటీ పత్రా లను అందజేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) వెంకట రమణారెడ్డి రైస్‌ మిల్లర్లును కోరారు.

ధాన్యం కొనుగోలుకు సిద్ధమవండి

మిల్లర్లతో జేసీ వెంకట రమణారెడ్డి 

ఏలూరుసిటీ, అక్టోబరు 12: ఖరీఫ్‌ ఽధాన్యం కొను గోలుకు అవసరమైన బ్యాంకు గ్యారెంటీ పత్రా లను అందజేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) వెంకట రమణారెడ్డి రైస్‌ మిల్లర్లును కోరారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలోని రైస్‌ మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 14 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు ఽలక్ష్యంగా నిర్ణయిం చామన్నారు. 50 శాతం ఎఫ్‌సీఐ, 50 శాతం సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ కొనుగోలు చేస్తుందన్నారు.  రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుందని ఇందుకు సిద్ధ్దంగా ఉండాలని సూచించారు.


రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సామంతపూడి శ్రీనివాసరాజు మాట్లాడుతూ సార్టెక్స్‌ మిషనరీ ఏర్పాటుకు కొన్ని మిల్లుల్లో ఇబ్బందులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు నగదు చెల్లిస్తే గాని గ్యారెంటీ పత్రాలు ఇచ్చే పరిస్థితిలో లేమని తమకు రావాల్సిన బకాయిల మొత్తం నుంచి ప్రస్తుతం రూ.250 కోట్లు ఇప్పించాలని కోరారు. తెలి పారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ డీఎం దాసి రాజు, డీఎస్‌వో సుబ్బరాజు, రైస్‌ మిల్లుర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆళ్ళ సతీష్‌ చౌదరి, జిల్లాలోని రైస్‌ మిల్లుల యజమానులు, అధికారులు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T10:10:24+05:30 IST