గోతులమయం..!

ABN , First Publish Date - 2020-10-13T10:03:46+05:30 IST

మండలంలోని పలు ప్రధాన రహదారులు చెరువుల ను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు రహదారిపై పడ్డ గోతు ల్లోకి వర్షపునీరు చేరి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు.

గోతులమయం..!

 అధ్వానంగా చాటపర్రు, వెంకటాపురం రోడ్లు 

 వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్న వైనం

 వాహనదారుల పాట్లు.. పట్టని అధికారులు 

 

ఏలూరు రూరల్‌, అక్టోబరు 12: మండలంలోని పలు ప్రధాన రహదారులు చెరువుల ను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు రహదారిపై పడ్డ గోతు ల్లోకి వర్షపునీరు చేరి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధాన రహదారులపై ఇప్పటికే ఉన్న  గోతుల్లోకి వర్షాల కారణంగా నీరుచేరి మరింత ప్రమాదకరంగా మారాయి. చాటపర్రు రోడ్డు, వెంకటాపురం రోడ్డు మరింత అధ్వానంగా మారాయి.


వర్షాలు కురుస్తుండడంతో గోతులు రోజు రోజుకూ పెద్దవి అవుతున్నాయి. రాత్రిపూట వాహనదారుల ప్రయాణం వర్ణనా తీతం. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు గోతుల్లో మట్టి, కంకర వేసి పూడ్చడం తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు. ఇప్పటికైనా చిధ్రమైన రహదారులను అభివృద్ధి  చే యాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.  

Updated Date - 2020-10-13T10:03:46+05:30 IST