రైతుల త్యాగాలకు విలువేది

ABN , First Publish Date - 2020-10-12T06:48:14+05:30 IST

భావితరాల భవిష్యత్తు కోసం అమ రావతిలో రాజధానిని నిర్మించడం కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎక రాలు ఇచ్చారని వారి త్యాగాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విలువ లేకుం డా చేస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధా కృష్ణయ్య (చంటి) అన్నారు.

రైతుల త్యాగాలకు విలువేది

అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ శ్రేణులు నిరసన

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, అక్టోబరు 11: భావితరాల భవిష్యత్తు కోసం అమ రావతిలో రాజధానిని నిర్మించడం కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎక రాలు ఇచ్చారని వారి త్యాగాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విలువ లేకుం డా చేస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధా కృష్ణయ్య (చంటి) అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 300 రోజులకు చేరుకోగా వారికి మద్దతుగా టీడీపీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.


తొలుత ర్యాలీగా వసంత మహల్‌ సెంటర్‌కు చేరుకుని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలిపారు. టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, ఉప్పాల జగదీశ్‌బాబు, దాసరి ఆంజనేయులు, చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్‌, శివ ప్రసాద్‌,  హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-12T06:48:14+05:30 IST