నాలుగు కోట్ల రుణమిస్తానని..

ABN , First Publish Date - 2020-10-07T10:49:44+05:30 IST

నాలుగు కోట్ల రుణం ఇప్పి స్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి నాలుగు లక్షలకు టోకరా వేసిన ఛీటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నాలుగు కోట్ల రుణమిస్తానని..

రూ.4 లక్షలకు టోకరా

ఏలూరు క్రైం, అక్టోబరు 6 : నాలుగు కోట్ల రుణం ఇప్పి స్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి నాలుగు లక్షలకు టోకరా వేసిన ఛీటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరుకు చెందిన విన్నకోట రాధికకు ఒక వ్యక్తి ఫోన్‌ చేసి తన పేరు రఘురామ రెడ్డి అని చెప్పి, తన ఆర్‌ఆర్‌ ఫైనాన్స్‌ కంపెనీ ద్వారా నాలుగు కోట్ల రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. జీఎస్‌టీ కింద నాలుగు లక్షలు అకౌంట్లో వేయాలన్నాడు. ఆమెను దెందులూరు మండ లం పోతునూరుకు చెందిన సూర్యరమేష్‌ అనే వ్యక్తి నమ్మిం చాడు.


అకౌంట్‌లో సొమ్ము వేసిన తరువాత వారిద్దరూ కనిపిం చకపోవడంతో బాధితురాలు ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీఐ బోణం ఆది ప్రసాద్‌, ఎస్‌ఐ నాగబాబుతో కూడిన బృందం రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. చిత్తూరు జిల్లా మద్దినాయనపల్లికి చెందిన బండి ఫణీంద్ర ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. అతనికి సహకరించిన రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫణీంద్ర తెలుగు మేట్రిమోనీ పేరు తో నకిలీ ఐడీ కార్డులను సృష్టించి పలువురు మహిళలను పెళ్లి చేసుకుంటానని, వివాహాలు కుదురుస్తానని మోసం చేశాడు.


ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరిని, రుణాలు ఇప్పిస్తానని ఇం కొందరిని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఫణీంద్రతోపాటు అత నికి సహకరించిన సూర్య రమేష్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితు లను కోర్టుకు హాజరుపర్చారు. 

Read more