ఆలయాలను కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2020-10-04T07:35:47+05:30 IST
హిందూ దేవాలయాలను కాపాడుకోవాలని, దాడులను అరికట్టాలని దత్త పీఠం స్వామీజీ సాయిదత్త నాగానంద సరస్వతి తెలిపారు.
తాడేపల్లిగూడెం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : హిందూ దేవాలయాలను కాపాడుకోవాలని, దాడులను అరికట్టాలని దత్త పీఠం స్వామీజీ సాయిదత్త నాగానంద సరస్వతి తెలిపారు. తాడేపల్లిగూడెంలోని 17వ వార్డులో ఉన్న విశ్వదుర్గేశ్వరీ సమేత ఆనందేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఆయన సంద ర్శించారు. విశ్వదుర్గేశ్వరి ఆలయానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. విశ్వదుర్గేశ్వరి మాతను దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయన్నారు. భగవం తుని పట్ల ప్రతిఒక్కరూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని వివరించారు.