స్పీడు బ్రేకర్ ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2020-10-03T09:49:47+05:30 IST
మండలంలోని చల్లచింతలపూడి యాదవులపేట నాలు గురోడ్ల జంక్షన్ వద్ద స్పీడ్‌బ్రేకర్ లేక చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నా రని అధికారులు స్పందించి స్పీడుబ్రేకర్ ఏర్పాటు చేయాలని చల్లచింతల పూడి గ్రామస్థులు కోరుతున్నారు.

దెందులూరు, అక్టోబరు 2:మండలంలోని చల్లచింతలపూడి యాదవులపేట నాలు గురోడ్ల జంక్షన్ వద్ద స్పీడ్‌బ్రేకర్ లేక చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నా రని అధికారులు స్పందించి స్పీడుబ్రేకర్ ఏర్పాటు చేయాలని చల్లచింతల పూడి గ్రామస్థులు కోరుతున్నారు.
కొత్తకమ్మవారిగూడెం రోడ్డు నుంచి ద్వారకా తిరుమల రోడ్డు, యాదవులపేట నుంచి గౌడవీధికి వెళ్లే రహదారికి స్పీడుబ్రేకర్ లేకపోవడం వల్ల వాహనదారులు వేగంగా వస్తుండటంతో ఇళ్ల ముందు రోడ్డుపై ఆడుకునే చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.