బతుకు బండికి అన్‌లాక్‌

ABN , First Publish Date - 2020-10-03T09:48:07+05:30 IST

లాక్‌డౌన్‌తో అమితంగా ప్రభావితమైన రంగం విద్యారం గం. వేలమంది ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలు రోడ్డున పడ్డాయి. వారికి అన్‌లాక్‌ 5.0 కొత్త ఆశలు చిగురింపజేసింది.

బతుకు బండికి అన్‌లాక్‌

తగ్గుతున్న కరోనా కేసులు.. అయినా అప్రమత్తత తప్పదు

సాధారణ స్థితికి జన జీవనం.. ఎవరి పనుల్లో వారు 

గాడిన పడుతున్న వివిధ రంగాలు.. రోడ్లపై పెరిగిన రద్దీ

వరుస సెట్లతో విద్యార్థుల కుస్తీ.. పాఠశాలలకూ గ్రీన్‌ సిగ్నల్‌

15 నుంచి వెండి తెర వెలుగులు.. అన్‌లాక్‌ 5 విడుదల


(ఏలూరు-ఆంధ్రజ్యోతి):

లాక్‌డౌన్‌తో అమితంగా ప్రభావితమైన రంగం విద్యారం గం. వేలమంది ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలు రోడ్డున పడ్డాయి. వారికి అన్‌లాక్‌ 5.0 కొత్త ఆశలు చిగురింపజేసింది. పాఠశాలలపై నిర్ణయాధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు అప్పగిం చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో జిల్లాలో ఇప్పటికే 9 నుంచి ఇంటర్‌ వరకు సందేహాల నివృత్తికి విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళుతున్నారు.


రెండో వారంలో తరగతుల నిర్వహిస్తారన్న వార్తలు వస్తున్నాయి. తల్లిదం డ్రుల రాతపూర్వక అనుమతి ఉంటేనే పిల్లలకు క్లాసులు నిర్వహించాలి. ఆన్‌లైన్‌ క్లాసులకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యా సంస్థలు తెరుచుకుంటే పనిలేక అల్లాడుతున్న విద్యావంతు లకు, ప్రైవేటు ఉపాధ్యాయులకు కష్టాలు కొంతతగ్గే అవకా శం ఉంది. ప్రజారవాణా ఇప్పటికే అన్నిరకాల సడలింపులతో నడుస్తోంది. గత వారమే పూర్తిస్థాయి సామర్థ్యంతో బస్సులు నడిపేందుకు చొరవ తీసుకుంది.


పండగల సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రజల కదలికలు పెరిగాయి. దీంతో నష్టాలకు తెరపడుతుందని పీటీడీ అధికారులు ఆశలు పెం చుకున్నారు. దశలవారీగా సర్వీసులు పెంచేందుకు అధికారు లు కసరత్తు మొదలుపెట్టారు. చౌకగా రవాణా సేవ లను అందించే రైలు బళ్లు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. 


అన్‌లాక్‌ ప్రక్రియ నాలుగు నెలల క్రితమే మొదలైనా సెప్టెంబరు నుంచే భవన నిర్మాణ రంగంలో కొంత మార్పు కనిపిస్తోంది. అన్‌లాక్‌ 5.0 మరింత అవకాశాన్ని ఇచ్చినా, ఇసుక సమస్య నీడలా ఈ రంగాన్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ పనికోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి భవన నిర్మాణ కార్మికులను వెంటాడుతోంది. ఇప్పటికే పలు రంగా లు సాధారణ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. జిల్లాలో అత్యంత ప్రాధాన్యంవున్న వ్యవసాయం, పాడి, ఆక్వా పరి శ్రమ సాధారణ స్థితికి వచ్చింది. పారిశ్రామిక రంగం అదేబాటలో ఉంది. వివాహాలు, ఫంక్షన్‌లు, మీటింగులు, ఆధ్యాత్మిక సమావేశాలకు నిబంధనలు మరింత సరళమ య్యాయి. భౌతిక దూరం తప్పనిసరి.


ప్రభుత్వ శాఖల్లో తొలగిన నిబంధనాలు

ప్రభుత్వ శాఖల్లోను నిబంధనల బంధనాలు తొలగిపో యాయి. పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. కార్యాలయాలన్నీ తెరిచే ఉంటున్నప్పటికీ సిబ్బందిని వెంటా డుతున్న భయం సేవలపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రంగాలలో కీలకమైన ఎక్సైజ్‌ శాఖ సాధారణ స్థితికి వచ్చింది. బార్లు  తెరుచుకోవడంతో నూరు శాతం ఈ శాఖ జోరు కొనసాగు తోంది. రిజిస్ట్రేషన్‌ శాఖ ఇంకా గాడిన పడలేదు. రియల్‌ ఎస్టేటు రంగం గాడిన పడకపోవడమే అందుకు కారణం. 


సందడి చేయనున్న థియేటర్లు

మార్చి 22న జనతా కర్ఫ్యూతో మూతపడి బూజు పట్టిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు తాజా షోకుతో సిద్ధమవను న్నాయి. ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చన్న వార్త వినోద ప్రియులను కొత్త అనుభూతికి గురిచేస్తోంది. జిల్లాలోని 96 సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ప్రజలకు వినో దాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 50 శాతం సీటిం గ్‌ నిబంధన తప్పదు. అలాగే పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జిల్లాలో అన్‌లాక్‌ 4.0తోనే ప్రజా జీవ నం సాధారణ స్థితికి వచ్చింది. మార్కెట్లు, దుకాణాలు, షాపు లు, మాల్స్‌ అన్నింటికీ ఉదయం ఏడు నుంచి రాత్రి 7 గంట ల వరకూ ప్రభుత్వం అనుమతించింది.


దీంతో షాపుల్లో జనం కిటకిటలాడుతున్నారు. రాత్రి 9 గంటల వరకూ షాపు లు తెరిచే ఉంటున్నాయి. తాజా సడలింపులతో ఈ పరిస్థితి మరింత వేగం పుంజుకోవచ్చు. టీ స్టాళ్లు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు నెలక్రితమే సాధారణ స్థితికి వచ్చేశాయి. సాయం త్రమైతే టీస్టాళ్ల వద్ద జనం రద్దీ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అన్ని రంగాలు పట్టాలెక్కనున్నాయి. 

Updated Date - 2020-10-03T09:48:07+05:30 IST