దళిత యువతి అత్యాచార నిందితులను శిక్షించాలి

ABN , First Publish Date - 2020-10-03T09:25:39+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతి అత్యాచార నిందితులను శిక్షించాలని సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా సంఘాలు ధర్నా నిర్వహించాయి. పోలవరం అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆందోళన చేశారు.

దళిత యువతి అత్యాచార నిందితులను శిక్షించాలి

పోలవరం, అక్టోబర్‌ 2 : ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతి అత్యాచార నిందితులను శిక్షించాలని సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా సంఘాలు ధర్నా నిర్వహించాయి. పోలవరం అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆందోళన చేశారు. సీఐటీయూ పోలవరం మండల నాయకురాలు పీఎల్‌ఎస్‌ కుమారి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఏపీ గిరిజన సంఘం నాయకులు, అంగన్వాడీ, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

టి.నరసాపురం : యూపీలో దళిత యువతి అత్యాచార నిందితులను ఉరితీయాలని టి. నరసాపురంలో అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ రాష్ట్ర పబ్లిక్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ దూబా విల్సన్‌ శుక్రవారం పేర్కొన్నారు. అత్యాచారం చేసిన నలుగురిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎయిమ్స్‌ నాయకులు గుండే మహరాజ్‌, నాగేంద్ర, ప్రసాద్‌ పాల్గొన్నారు. 


చింతలపూడి : దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ మండల కార్యదర్శి గురవయ్య అన్నారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన తెలుపుతూ వినతిపత్రాలు అందించా రు. యుపీలో జరిగిన ఘటనలు దేశ వ్యాప్తంగా కుదిపేశాయన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టి. బాబు, ఎం. నాగేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, పి.రాజు, తదితరులు పాల్గొన్నారు.


చాగల్లు : దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని నిర్భయ చట్టంను మరింత కఠినంగా అమలు చేయాలని శ్రామిక మహిళలు కోరారు. శుక్రవారం స్థానిక సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి సీఐటీయూ ఆధ్వర్యంలో యూపీ ఘటనను నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2020-10-03T09:25:39+05:30 IST