టీడీపీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తా

ABN , First Publish Date - 2020-09-29T09:07:23+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నా యుడు తనకు అప్పగించిన బాధ్యతలు అత్యంత క్రమశిక్షణతో బాధ్యతాయు తంగా నిర్వహిస్తానని నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన తోట సీతారామలక్ష్మి అన్నారు.

టీడీపీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తా

నరసాపురం అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 28 : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నా యుడు తనకు అప్పగించిన బాధ్యతలు అత్యంత క్రమశిక్షణతో బాధ్యతాయు తంగా నిర్వహిస్తానని నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన తోట సీతారామలక్ష్మి అన్నారు. సీతారామలక్ష్మికి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు.


నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కృషిచేస్తానన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోళ్ళ నాగేశ్వరరావు, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణ మ్మ మాట్లాడారు.


మామిడిశెట్టి ప్రసాద్‌, వేండ్ర శ్రీనివాస్‌, ఎండి సబీనా బేగం, మద్దుల రాము, ఎం.గున్నెశ్వరరావు, గంటా త్రిమూర్తులు, ఈపి.శేషు, ఉప్పులూరి చంద్రశేఖర్‌, మైలాబత్తుల ఐజాక్‌ బాబు, తదితరులు ఆమెను అభినందించిన వారిలో ఉన్నారు.

Updated Date - 2020-09-29T09:07:23+05:30 IST