-
-
Home » Andhra Pradesh » West Godavari » tnk news
-
కొంగొత్తగా ..
ABN , First Publish Date - 2020-08-20T09:23:17+05:30 IST
అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా దశల వారీగా అభివృద్ధి చేసే క్రమంలో ఈ ఏడా ది ఒకటో తరగతి నుంచి ఆరో తర

ఒకే పాఠ్యపుస్తకంలో కుడి, ఎడమ పేజీల్లో రెండు మాధ్యమాలు
ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మారిన పాఠ్యపుస్తకాలు
ఏలూరు ఎడ్యుకేషన్, ఆగస్టు 19 : అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా దశల వారీగా అభివృద్ధి చేసే క్రమంలో ఈ ఏడా ది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు పాఠ్య పుస్తకాల స్వరూప స్వభావాలు సమగ్రంగా మారిపోయాయి. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఆంగ్ల మాధ్యమ బోధన వైపే సుమారు 98 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపిన నేప థ్యంలో ఆ దిశగానే టెస్ట్ బుక్‌ల ముద్రణ పూర్తి కాగా, జిల్లాలోని మండల కేంద్రాలకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు.
సెప్టెంబరు 5న పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వం సన్నా హాలు చేస్తుండగా, అదే రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ టెస్ట్‌బుక్‌లు సరికొత్త రూపంలో దర్శనమివ్వను న్నా యి. లాంగ్వేజెస్ సబ్జెక్టు (తెలుగు,హిందీ,ఇంగ్లీషు)ల పాఠ్యపుస్తకాలు అలా గే ఉంటాయి. ఇక నాన్- లాంగ్వే జస్ సబ్జెక్టులైన సైన్సు, గణితం, సోషల్ స్టడీస్ టెస్ట్‌బుక్‌లను తెలుగు మాధ్యమం కోరుకునే విద్యా ర్థులకు సైతం ఉపయోపడేలా సరికొత్త విధానంలో ముద్రించారు.
ఒకే పాఠ్యాంశాన్ని పుస్తకంలో కుడి వైపు పేజీలో తెలుగు మాధ్యమంలో, ఎడమ వైపు పేజీ లో ఆంగ్ల మాధ్యమంలో ముద్రించారు. ఇలా రెండు మాధ్యమాలతో కూడి న పాఠ్యపుస్తకాల వల్ల పేజీల సంఖ్య, పుస్తక పరిమాణం, బరువు పెరి గినందున ఒక్కో సబ్జెక్టు టెస్ట్‌బుక్‌ను మూడు సెమిస్టర్లు (పార్టులు)గా విభజించి ముద్రించారు. ఆంగ్ల మాధ్యమం బోధనపై సుప్రీంకోర్టులో దాఖ లైన వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నందున న్యాయపరమైన వివాదాలకు అ స్కారం లేకుండా రెండు మాధ్యమాల్లో ఒకేచోట పాఠ్యాంశాలు పక్క పక్కనే వచ్చేలా ముద్రించి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.