ముగ్గురు సీఐలకు బదిలీ ఉత్తర్వులు జారీ
ABN , First Publish Date - 2020-12-17T05:30:00+05:30 IST
ఏలూరు రేంజ్ పరిధిలో ముగ్గురు సీఐలను బదిలీలు చేస్తూ డీఐజీ మోహనరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏలూరు క్రైం, డిసెంబరు 17 : ఏలూరు రేంజ్ పరిధిలో ముగ్గురు సీఐలను బదిలీలు చేస్తూ డీఐజీ మోహనరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, చిలకలపూడి పోలీసు స్టేషన్ సీఐగా పనిచేస్తున్న ఎం. వెంకట నారాయణను అదే జిల్లా నూజివీడు పోలీసు స్టేషన్‌కు, నూజివీడు సీఐగా పనిచేస్తున్న రామచంద్రరావు ఏలూరు రేంజ్ వీఆర్‌కు పంపించారు. దీంతోపాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం పీసీఆర్ విభాగం సీఐగా పనిచేస్తున్న ఆర్.అంకబాబును అదే పట్టణంలోని చిలకలపూడి సీఐగా నియామకం చేశారు.