వైసీపీ, టీడీపీ బాహాబాహీ

ABN , First Publish Date - 2020-03-15T11:38:06+05:30 IST

ఎంపీటీసీ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు లేకుండానే వారి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలు అధికారులకు చేరడంపై

వైసీపీ, టీడీపీ బాహాబాహీ

గోపాలపురం, మార్చి 14: ఎంపీటీసీ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు లేకుండానే వారి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలు  అధికారులకు చేరడంపై వివాదం నెలకొంది. గోపాలపురం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీ తల పడ్డారు. రిటర్నింగ్‌ అధికారి సాయిరమేష్‌ ఆధ్వర్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం నిర్వహించారు. కరిచర్లగూడెం గ్రామానికి టీడీపీ అభ్యర్థి అనిశెట్టి కడియాలమ్మకు చెందిన ఉప సంహరణ పత్రాన్ని అభ్యర్థి లేకుండానే అధికారులకు వైసీపీ నాయ కులు సమర్పించారంటూ వాగ్వావాదానికి దిగారు.


అధికారుల చేతిలో ఉన్న ఉపసంహరణ పత్రాన్ని చింపివేసిన టీడీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు పట్టుబట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సుమారు 4.30 గంటలకు టీడీపీ అభ్యర్థి అనిశెట్టి కడి యాలమ్మను లోపలకి తీసుకెళ్లి ఉపసంహరణ చేయించడంపై మరో మారు టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. రిటర్నింగ్‌ అధికారి సాయి రమేష్‌ను వివరణ కోరగా తమ వద్ద ఉన్న పత్రాలను ఎవరు చించలేదన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-03-15T11:38:06+05:30 IST