-
-
Home » Andhra Pradesh » West Godavari » There are no actions to cheat users
-
వినియోగదారులను మోసగిస్తే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2020-03-25T10:37:24+05:30 IST
కరోనా ప్రభావంతో నిత్యావస రాలను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు తప్పవని లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్

తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 24 : కరోనా ప్రభావంతో నిత్యావస రాలను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు తప్పవని లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ బి.కుమారి తెలిపారు. పట్టణంలో మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు, కిరాణా సరుకుల దుకాణాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూరగాయల దుకాణాల వద్ద ధరలు పట్టిక ఏర్పాటు చేయాలని, బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.