ఉపసంహరణం

ABN , First Publish Date - 2020-03-15T11:49:31+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల తుది జాబితా శని వారం సాయంత్రం విడుదలైంది.

ఉపసంహరణం

పరిషత్‌లో ఏకగ్రీవ పోరు

ఫోర్జరీల వివాదం, విపక్షాల ఆందోళన

కొన్నిచోట్ల అభ్యర్థుల వెనుకడుగు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల తుది జాబితా శని వారం సాయంత్రం విడుదలైంది. ఏకగ్రీవం దిశగా కొన్నిచోట్ల అనూహ్య పరిణా మాలు చోటుచేసుకున్నాయి. జిల్లా ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా స్థానిక పోరులో చోటా మోటా నేతలు రెచ్చిపోయారు. ప్రత్యర్థులను భయపెట్టారు. ఇంకొందరిని దారిలోకి తెచ్చుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. కొందరికి కాసులు ఎరవేశారు. కేసులతో భయపెట్టారు. రాజకీయ ఎత్తుగడలు పరా కాష్టకు చేరాయి. గెలుపే ధ్యేయంగా వైసీపీ బరితెగించి వ్యవహరించింది. అఽధకారుల ను గుప్పిట పట్టింది. ఎన్నికల నియామవళి సంపూర్తిగా అమలు చేస్తున్నట్టు చెబు తూనే కొన్నిచోట్ల చూసీచూడనట్టు వ్యవహరించింది. ఆరోపణలు, విమర్శలు వెల్లువె త్తాయి.


భీమవరం మండలం పెదగరువులో బిజెపి అభ్యర్ధి ప్రమీల నామినేషన్‌ తిరస్కరణ రచ్చకు దారితీసింది. దాదాపు రెండు గంటల పాటు జన సేన, బీజేపీ నేతలు రోడ్డుకెక్కారు. వాస్తవానికి పెదగరువు ఎంపీటీసీ స్థానం జనరల్‌ కోటాలో రిజర్వు కాగా బీజేపీ అభ్యర్థిగా ప్రమీలను రంగంలోకి దించారు. నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టుగా అధికారులకు పత్రం అందింది. కొందరు తమ అభ్యర్ధి సంతకాన్ని ఫోర్జరీ చేసి సమర్పించారంటూ రిటర్నింగ్‌ అఽధికారికి ఫిర్యాదు చేసేం దుకు ప్రయత్నించినా ప్రమీల నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టుగానే భావిస్తు న్నట్లు అధికారులు ధ్రువీకరించారు. దీనితో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పంపారు. ఇక్కడ కావాలనే పెదగరువు ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ తొలగించి తమ పని పూర్తి చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నించిందంటూ జనసేన నేతలు విరుచుకు పడ్డారు. దీనికి రివర్స్‌గా ఉండి మండలం చిలుకూరు ఎంపీటీసీ స్థానంలో మరో వివాదం చోటు చేసుకుంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన టి.రామారావు పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఉపసంహరణ పత్రాన్ని ఆయన కుమారుడే అఽధికారులకు అందించారు. ఇదంతా వైసీపీ వ్యూహాంలో భాగమేనంటూ తెలుగుదేశం ఆందోళనకు దిగింది. ఫోర్జరీని రుజువు చేయాల్సిందిగా అధికారులు టీడీపీ నేతలకు గంటపైగానే సమయం ఇచ్చి అభ్యర్థినే స్వయంగా హాజరుపరచాలని కోరారు. అభ్యర్థి రాకపోవ డంతో ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధి నిష్క్రమించినట్టు అధికారులు ప్రకటించారు. ఇదే మండలంలో యండగండి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి శాంతకుమారి గడిచిన రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో పోటీ నుంచి ఆమె నిష్క్రమించారు. ఆ స్థానం వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. 


భి.ఫారం అందలేదన్నారు..!

పెదవేగి మండలం రెండు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులకు భీ - ఫారాలు ఇవ్వలేదని వారిద్దరినీ ఇండిపెండెంట్లుగా ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. టీడీపీ సీనియర్‌ నేత చింతమనేని ప్రభాకర్‌ స్వగ్రామం దుగ్గిరాల నుంచి ప్రసన్న, పెదవేగి నుంచి సావిత్రిని పార్టీ అభ్యర్ధులుగా నిర్ణయించి వారికి బి- ఫారాలు అందజేయగా శుక్రవారం నాడే అధికారులకు అందజేశారు. తీరా నామినేషన్లు ఉపసంహరణకు తుది గడువురోజు మాత్రం బి- ఫారాలు తమకు అం దలేదని అధికారులు తేల్చి చెప్పడంతో తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఎన్నికల అధికారులు దిగివచ్చి జరిగిన తప్పిదం సవరిస్తున్నట్టు ప్రకటించారు.  


ఎన్నికల సిత్రాలు

భీమవరం మండలం వెంపలో జనసేన అభ్యర్థి కిడ్నాప్‌కు గురైనట్లు శుక్రవారం బహిర్గతమైంది. ఇదంతా అభూత కల్పనని జనసేన అభ్యర్థి స్వయంగా ప్రకటిం చారు. కావాలనే వైసీపీనే రాద్ధాంతం చేసిందని, ఆ పార్టీ తమను భయభ్రాం తులకు గురిచేయడంతో స్వీయ రక్షణలో గడిపామని ఆందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఇరగవరం మండలం జడ్పీటీసీ స్థానానికి జనసేన అభ్యర్ధిగా బొక్కా భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. గడిచిన కొద్ది గంటలుగా ఆయనతో వైసీపీ నేతలు రాయబారాలు నడిపారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేయకుండానే భాస్కరరావు ఇంటిముఖం పట్టారు. అయితే ఈ నిష్క్రమణ వెనుక చాలా పెద్ద కదే ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. 

ఆకివీడు మండలం సిద్ధాపురం ఎంపీటీసీ స్థానం కైవసం చేసుకోవాలని వైసీపీ ఎత్తుగడ వేసింది. దీనికి లోబడే వైసీపీ అభ్యర్ధులుగా శివాజీ, ఆయన సతీమణి కూడా నామినేషన్‌ వేశారు. తీరా బీ - ఫారాన్ని పి.రామకృష్ణ చేతికందించారు. దీంతో ఆగ్రహం పట్టలేక శివాజీ దంపతులు పోటీలో ఉండాలని నిర్ణయించారు. 

పోడూరు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. చెరొక స్థానాన్ని వైసీపీ, టీడీపీలు దక్కించుకున్నాయి. మూడో స్థానం ఇండిపెండెంట్‌ వశం అయినట్టు అధికారులు ప్రకటించారు. జనసేన మాత్రం ఆ మూడో సీటు నుంచి తమ అభ్యర్దే గెలుపొందాడంటూ సంబరాలు చేసుకున్నారు. 


అభ్యర్థుల వెనుకడుగు..

ఏలూరు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానాల్లో ఆఖరి నిమిషాన అనూహ్య సంఘ టనలు చోటు చేసుకున్నాయి. ఏలూరు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి వెంకట రమణ ఆకస్మికంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ నుంచి బెదిరింపులు రావడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. పార్టీ నేతలు సైతం దీనికి ధీటుగా వ్యవహరించాలని, పోటీ కొనసాగించాలని కోరినప్పటికీ ఆమె మాత్రం నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.


దీంతో ఏలూరు జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ  కైవసం చేసుకుంది. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానానికి కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. సాధ్యమైనంత మేర ఒత్తిడి నెలకొన్న ఖాతరు చేయకుండా బరిలో నిలబ డతారని ఊహించిన దీనికి భిన్నంగా టీడీపీ అభ్యర్ధి ఆకస్మికంగా పరిషత్‌ పోరు నుంచి వైదొలిగారు. ఈ స్థానం కూడా వైసీపీ అలవోకగా దక్కించుకుంది. 


Updated Date - 2020-03-15T11:49:31+05:30 IST