స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి..

ABN , First Publish Date - 2020-03-08T11:52:10+05:30 IST

ఏలూరు రేంజ్‌లోని ప్రజలందరూ రానున్న స్థానిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవాలని డీఐజీ మోహనరావు అన్నారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ రేంజ్‌

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి..

ఏలూరు రేంజ్‌లోని ప్రజలందరూ రానున్న స్థానిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవాలని డీఐజీ మోహనరావు అన్నారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ రేంజ్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ, కృష్ణా, రాజమండ్రి అర్బన్‌ జిల్లాల్లో జరగనున్న ఎంపీపీ, జడ్పీటీసీ, పంచాయతీ, మునిసిపాలిటీ ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తామన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తామన్నారు.  దిశ చట్టం అమలులో చిత్తశుద్ధితో అమలు పరుస్తామన్నారు.  డీఐజీగా  కేవీ మోహనరావు ఉద్యోగ బాధ్యతలు చేపట్టడంతో జిల్లా పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందలు తెలిపారు. 

Updated Date - 2020-03-08T11:52:10+05:30 IST