గ్రామాలలో తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు

ABN , First Publish Date - 2020-04-14T10:13:36+05:30 IST

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపడానికి చర్యలు చేపట్టాలని

గ్రామాలలో తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు

గణపవరం, ఏప్రిల్‌ 13 : వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అధికారులకు సూచించారు. సోమవారం ఎస్‌.కొండేపాడు, కేశవరం, మొయ్యేరు, డీకేవల్లి, కోమర్రు, వెంకటరాజపురం, పిప్పర గ్రామాల్లో పర్యటించి తాగునీటి చెరువులను ఆయన పరిశీలించారు.  పద్నాల్గవ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ మరమ్మతులు, పైపులైన్లు, తదితర తాగునీటి వనరుల అభివృద్ధికి నిధులు వెచ్చించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామాల్లో ఆరోగ్య శ్రీకార్డులను ఎమ్మెల్యే వాసుబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు.


కుళాయి కనెక్షన్‌పై ఇంటింటి సర్వే

వీరవాసరం: గోదావరి నుంచి శుద్ధి చేసిన జలాలను ప్రజలకు అందించేందుకు జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ పఽథకం అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా సోమవారం గ్రామ వలంటీర్లతో సర్వే నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ కుళాయి ఉన్నదీ, లేనిదీ వివరాలు సేకరించారు. ఈ వివరాల ఆధారంగా నివేదిక రూపొందిస్తారు. దీని ప్రకారం వాటర్‌ గ్రిడ్‌ పథకంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ మంజూరు చేసే చర్యలు తీసుకుంటారని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు తెలియజేశారు. 

Updated Date - 2020-04-14T10:13:36+05:30 IST