-
-
Home » Andhra Pradesh » West Godavari » The government has announced the najrana for the unanimously elected village panchayats
-
ఏకగ్రీవ నజరానా..
ABN , First Publish Date - 2020-03-13T11:30:40+05:30 IST
పంచాయతీ సర్పంచ్‌లను ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది.

నల్లజర్ల: పంచాయతీ సర్పంచ్‌లను ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జీవో- 157 బుధవారం విడుదల చేసింది. జనాభా 2 వేలు కంటే తక్కువ ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2వేల పైబడి 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల పైబడి 10 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేలు పైబడి ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు నజరానా కింద అందజేస్తారు.