చేయూతకు నేటితో ముగియనున్న గడువు

ABN , First Publish Date - 2020-07-05T11:40:08+05:30 IST

మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం శక్తి సంఘాల మహిళలతో

చేయూతకు నేటితో ముగియనున్న గడువు

 ఇప్పటికీ 50 శాతమే నమోదు..

గడువు పెంచాలంటూ విజ్ఞప్తి 


ఏలూరు రూరల్‌, జూలై 4 : మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం  వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం శక్తి సంఘాల మహిళలతో పాటు ఇతర మహిళలకు నాలుగేళ్లల్లో ఒకొ క్కరికి రూ.75 వేలు చొప్పున ఈపథకం కింద అందించా లని నిర్ణయిం చింది. ఈనెల ఐదులోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది.  ఇప్పటి వరకూ జిల్లాలో 50 శాతం దరఖాస్తులు కూడా నమోదు కాలేదు. నేటితో గడువు ముగియనుండడంతో దరఖాస్తు దారుల్లో ఆందోళన నెల కొంది. ఈ పథకం పొందాలంటే కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.


వీటి కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ అత్యధికు లు ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా మంది దరఖాస్తుదారుల ఫోన్‌ నెంబ ర్లు ఆధార్‌ నెంబర్‌కు లింకు కాలేదు. దీంతో దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. మరో పక్క సర్వర్‌  మొరాయింపు ఇబ్బందిగా మారింది. అలాగే వార్షిక ఆదాయంపై స్పష్టత లేకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకునేవారు సతమతమవుతున్నారు.  ప్రభుత్వం అర్హతలకు సంబంధించి పూర్తి నిబంధనలు తెలపడంతో పాటు గడువు పొడిగించా లని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-07-05T11:40:08+05:30 IST