పరీక్షలు వేగవంతం

ABN , First Publish Date - 2020-06-25T10:15:44+05:30 IST

జిల్లాలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్‌ పరీక్షల్లో వేగం పెరగడం, ఎప్పటిక ప్పుడు కేసు ల నిర్ధారణ జరగడంతో

పరీక్షలు వేగవంతం

నేటి నుంచి అందుబాటులోకి వైరాలజీ ల్యాబ్‌

రోజుకు మూడు వందల నమూనాల పరీక్ష

తాజాగా జిల్లాలో 26 కేసులు.. మొత్తం 929

 వైద్యుల నియామకంపై ఐఎంఏ సహకారానికి ప్రతిపాదన


ఏలూరు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్‌ పరీక్షల్లో వేగం పెరగడం, ఎప్పటిక ప్పుడు కేసు ల నిర్ధారణ జరగడంతో ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఇప్పటి వరకు జిల్లా లో రోజుకు 50 కేసులు తక్కువ కాకుండా నమోదవుతుండగా.. బుధవారం 26 కేసులు బయటపడ్డాయి. ఏలూరు సుంకరవారితోట, బోసు బొమ్మవీధి, సత్రంపాడు, నాల్గవ డివిజన్‌, శ్రీనివాసనగర్‌, సత్యనారాయణపేట, ఫిలాస్‌ పేట, తాటిమేళ్ళవారివీధి, తూర్పు వీధి, రజకులపేట, మోతేవారి వీధి, ఆర్‌ఆర్‌ పేటల్లో 15 కేసులు నమోదయ్యాయి.


భీమవరం 23వ వార్డు, మొగల్తూరు, శేరిపాలెం, భీమడోలు మండలం గుండుగొలను, లింగపాలెం మండలం బాద రాల, గణపవరం మండలం పిప్పర, ఇరగవరం మండలం రేలంగి ఒక్కొక్కటి చొప్పున, తణుకులో రెండు, నరసాపురం మండలం సీతారామపురం, వల్లూరు పల్లిలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 929కు చేరింది. జిల్లాలో 59 వేల మందికి పరీక్షలు నిర్వహించగా, మరో వెయ్యి మంది పరీక్షల వివరాలు బయటపడా ల్సి ఉంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 147కు పెరిగింది. 


వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు

ఏలూరులోని ఆశ్రం మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ అనివార్య కారణాలతో బుధవారం ప్రారంభం కాలేదు. దీనిని గురువారం ప్రారంభించేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే పరీక్షల్లో వేగం పెరిగి రోజుకు 300 చొప్పున నమూ నాలను పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తారు. 


హోం క్వారంటైన్‌లోనూ పరీక్షలు

కొవిడ్‌ కేసులకు సంబంధించి అన్ని ఆసుపత్రుల్లోనూ పడకలు నిండిపోతే హోం క్వారంటైన్‌లలో ఉంచి కొందరికైనా చికిత్సలు చేయాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కేసుల సంఖ్య ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిపోవడం, వీరంతా డిశ్చార్జి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. హోం క్వారంటైన్‌లో చికిత్స చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేర్‌ సెంటర్లు ఆరంభించారు. డాక్టర్ల కొరత ఎదురవుతున్న దృష్ట్యా దీనిని అధిగమించేందుకు వీలుగా ఐఎంఏ సహకారాన్ని తీసుకోబోతున్నారు. ప్రత్యేకించి జిల్లాలోవున్న ప్రైవేటు ఆసుపత్రులు, పడకల సంఖ్య ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు, వైద్యుల సంఖ్య ఇతరత్రా వివరాలన్నింటిని సేకరించే పనిలోపడ్డారు.


వీలైనంత మేర ప్రతి ఆసుపత్రిలోనూ రోగులను ఉంచే పక్షంలో ఇలా ముందస్తు చర్యలకు దిగారు. అందుబాటులోకి వచ్చిన కేర్‌ సెంటర్లలో వైద్యులు ఎవరెవరు అందుబాటులో ఉంటున్నారు, మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్నారా ? వంటి అంచనాకు వచ్చి తగ్గట్టుగానే ఎక్కడైనా లోపం ఉంటే తక్షణం సవరించేందుకు సిద్ధపడుతున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సహకారంతో పూర్తిస్థాయిలో వైద్యులు సమీకరించి ప్రభుత్వ వైద్యులకు తోడుగా వీరిని ఆయా సెంటర్లలో సేవలకు వినియోగించుకోవాలనే ప్రతిపాదన చేశారు. 


Updated Date - 2020-06-25T10:15:44+05:30 IST