-
-
Home » Andhra Pradesh » West Godavari » temple
-
వేంకటేశ్వరస్వామికి శాంతి కల్యాణం
ABN , First Publish Date - 2020-11-22T04:27:20+05:30 IST
స్థానిక శంభన్న అగ్రహారంలోని వేంక టేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారికి శనివారం ప్రత్యేక పూజలతో పాటు స్వామి జన్మ నక్షత్రం శ్రవణానక్షత్రం కూడా కావడంతో ప్రత్యేక పూజలు, శాంతి కళ్యాణం నిర్వహించారు.

పాలకొల్లు అర్బన్, నవంబరు 21: స్థానిక శంభన్న అగ్రహారంలోని వేంక టేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారికి శనివారం ప్రత్యేక పూజలతో పాటు స్వామి జన్మ నక్షత్రం శ్రవణానక్షత్రం కూడా కావడంతో ప్రత్యేక పూజలు, శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విష్ణు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్‌లోని శ్రీవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యలమంచిలి, నవంబరు 21: కార్తీక మాసం తొలి శనివారం శ్రవణా నక్షత్రం సందర్భంగా యలమంచిలిలోని కేశవస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను తులసి మాలలతో అలం కరించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండలంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు, శివాలయాల్లో ప్రత్యేక దీపాలంకరణలు చేశారు.
