‘తెలుగు భాషాభివృద్ధికి కమిటీలు నియమిస్తాం’

ABN , First Publish Date - 2020-11-28T05:12:04+05:30 IST

జిల్లా వ్యాప్తం గా తెలుగు భాషాభివృద్ధికి కమిటీలను నియమి స్తున్నామని ఆసక్తిగల వారు తమకు తెలియజే యాలని, నూతన కమిటీల ద్వారా ఒక పరిణామం వస్తుందని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ శ్రీరంగసాయి తెలిపారు.

‘తెలుగు భాషాభివృద్ధికి కమిటీలు నియమిస్తాం’

భీమవరం టౌన్‌, నవంబరు 27 : జిల్లా వ్యాప్తం గా తెలుగు భాషాభివృద్ధికి కమిటీలను నియమి స్తున్నామని ఆసక్తిగల వారు తమకు తెలియజే యాలని, నూతన కమిటీల ద్వారా ఒక పరిణామం వస్తుందని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ శ్రీరంగసాయి తెలిపారు. భీమవరం లోని కిరాణా మర్చంట్స్‌ అసోసి యేషన్‌ భవనంలో శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా అభివృ ద్ధి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్యవేత్త చెరుకువాడ వెంకట్రామయ్య మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషకు ప్రాధాన్యం ఉందని అటువంటి భాషను ప్రాచీన భాషగా గుర్తింపు తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పశుసం వర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యగోవింద్‌ తెలుగుతల్లి బ్రోచర్‌ను అవిష్కరించారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Read more