13న తెలుగు భాషపై క్విజ్‌ పోటీలు

ABN , First Publish Date - 2020-11-27T05:05:05+05:30 IST

తెలుగు భాషపై పదో తరగతి విద్యార్థులకు క్విజ్‌పోటీని నిర్వహించాలని విద్యాశాఖ నిర ్ణయించింది.

13న తెలుగు భాషపై క్విజ్‌ పోటీలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 26 : తెలుగు భాషపై పదో తరగతి విద్యార్థులకు క్విజ్‌పోటీని నిర్వహించాలని విద్యాశాఖ నిర ్ణయించింది. సీపీ బ్రౌన్‌ – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (సీపీబీ – ఎస్‌పీబీ) పేరిట ఈ పోటీని డిసెంబర్‌ 13న నిర్వహిస్తారు. డిసెంబరు 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రథమ విజేతకు రూ.40 వేలు నగదు బహుమతి,  ప్రశంసాపత్రం, సంబంధిత స్కూలు తెలుగు ఉపాధ్యాయులకు రూ.10,116లతో పాటు సత్కారం, ప్రశంసా పత్రం అందజేస్తారు. పోటీలో పాల్గొనేందుకు ఞ్ట్ఛ్ఛౌ 2020 అని టైప్‌ చేసి 9952029498కు వాట్సప్‌ మెసేజ్‌ చేయాలి. విజేతలను డిసెంబర్‌ 20న ప్రకటిస్తారు.

Updated Date - 2020-11-27T05:05:05+05:30 IST