తెలంగాణ మద్యం.. నలుగురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-05-13T10:01:59+05:30 IST

తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిని నల్లజర్ల మండలం పోతినీడుపాలెం వద్ద

తెలంగాణ మద్యం.. నలుగురి అరెస్ట్‌

నల్లజర్ల, మే 12:  తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిని నల్లజర్ల మండలం పోతినీడుపాలెం వద్ద సోమవారం రాత్రి అరెస్ట్‌ చేసినట్టు  భీమడోలు ఎక్ష్సైజ్‌ సీఐ సత్యవతి తెలిపారు.  చోడవరం ప్రభుత్వ మద్యం షాపులో సూపర్‌వైజర్‌గా పని చేసే నెమలి రోహిత్‌, కత్తెర సుధాకర్‌ బైక్‌పై వెళ్లి 4 ఫుల్‌ బాటిల్స్‌, 4 హాఫ్‌ బాటిల్స్‌తో అశ్వారావుపేట నుంచి వస్తుండగా ముందస్తు సమాచారం మేరకు  వల పన్ని పట్టుకున్నట్టు తెలిపారు.పోతినీడుపాలెం గ్రామానికి చెందిన మట్టా హనుమంతరావు, కట్టా శ్రీకాంత్‌  అశ్వారావుపేట నుంచి బైక్‌పై 11 మద్యం బాటిల్స్‌ తెస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు. నలుగురి వ్యక్తులను, రెండు బైక్‌లు, ఇద్దరి నుంచి 19 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యవతి పేర్కొన్నారు.

Read more