బీఈడీ..లా!

ABN , First Publish Date - 2020-11-26T05:10:08+05:30 IST

బీఈడీ కోర్సుకు రానురాను ఆద రణ తగ్గుతోంది.

బీఈడీ..లా!

జిల్లాలో 18 కళాశాలల్లో 1,150 సీట్లు

ఈ ఏడాది ఎడ్‌సెట్‌ రాసింది 300 మందే

గతేడాది 119 సీట్లే భర్తీ.. ఈ ఏడాది ఎన్నో..?

కళాశాల యాజమాన్యాల్లో సందేహాలు

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 25: బీఈడీ కోర్సుకు రానురాను ఆద రణ తగ్గుతోంది. సీట్ల భర్తీ పడిపోతోంది. గతేడాది 11 శాతం మాత్రమే సీట్లు భర్తీ కాగా, ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందా అనే ఆలోచన కళాశాలల యాజమాన్యాల మదిని తొలుస్తోంది. జిల్లాలో 18 బీఈడీ కళాశాలలు ఉండగా వాటిలో బయాలజీ, ఇంగ్లిషు, మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, సోషల్‌ కోర్సులకు1,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 119 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రెండు కళాశాల్లో అయితే ఒక్కరూ జాయిన్‌ కాలేదు. 9 కళాశాలల్లో సింగిల్‌ డిజిట్‌ సీట్లే భర్తీ అయ్యాయి.కరోనా కారణంగా బీఈడీ విద్యా సంవత్సరం వెనక్కు వెళుతోంది. గతేడాది ఈ నెల మొదటిలోనే కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయింది.  2020–22 సంవత్సరానికి కౌన్సెలింగ్‌ తేదీ ఇప్పటికీ ప్రకటించలేదు. బీఈడీలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్‌కు ఈ ఏడాది జిల్లాలో 300లోపు విద్యార్థులు హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది సీట్ల భర్తీ అంతంతమాత్రంగానే ఉంటుంది. 2015 నుంచి బీఈడీ సీట్ల భర్తీ బాగా పడిపోయింది. బీఈడీ రెండేళ్ల కోర్సుగా మార్చడం, టీచర్‌ పోస్టుల భర్తీ లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థుల్లో ఆసక్తి తగ్గింది. ఈ పదేళ్లలో రెండుసార్లు డీఎస్సీ నిర్వహించినా ఒక పోస్టుకు వందలాది మంది పోటీ పడటం, పోస్టుల భర్తీలో జాప్యం, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ఆశించిన జీతాలు లేకపోవడం వంటి కారణాలతో ఆసక్తి తగ్గింది. 


Updated Date - 2020-11-26T05:10:08+05:30 IST