తక్షణమే ఇళ్లను అప్పగించాలి

ABN , First Publish Date - 2020-11-22T04:38:06+05:30 IST

టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర డిమాండ్‌ చేశారు.

తక్షణమే ఇళ్లను అప్పగించాలి
విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 21: టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర డిమాండ్‌ చేశారు. నా ఇల్లు – నా సొంతం కార్యక్రమంలో భాగంగా 4వ వార్డు లబ్ధిదారుల నుంచి సేకరించిన 300 పోస్టుకార్డులను శనివారం  ప్రధా ని మోదీ, సీఎం జగన్‌కు రిజిస్టర్డ్‌ పోస్టులో పంపించారు. ఈ సందర్భంగా వారు పోస్టాఫీసు వద్ద విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిర్మిం చిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా పేదలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.  పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Read more