రాజధానిగా అమరావతిని కొనసాగించాలి
ABN , First Publish Date - 2020-12-18T05:07:30+05:30 IST
రాజధానిగా అమరావతిని కొనసాగిం చాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు భూములు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ అ న్నారు.

రైతుల ఆందోళనకు మద్దతుగా టీడీపీ శ్రేణుల ర్యాలీ, పాదయాత్ర
పాలకొల్లు అర్బన్, డిసెంబరు 17: రాజధానిగా అమరావతిని కొనసాగిం చాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు భూములు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ అ న్నారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాదైన సందర్భంగా గురువారం పట్టణంలో రైతులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ఉద్యమంలో ప్రాణాలర్పించిన 66 మంది రైతులు, మహిళా రైతులు చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించారు. అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా గాంధీబొమ్మల సెంటర్ నుంచి పెద్దగోపురం, పాత పట్టణ పోలీస్ స్టేషన్‌మీదుగా యడ్ల బజారు వరకూ ర్యాలీ నిర్వహిం చారు. టీడీపీ నాయకులు కర్నేన గౌరునాయుడు, బోనం నాని కడలి గోపా లరావు, కోడి విజయభాస్కర్, గాదె సుబ్బారావు, జివి, సల్మాన్‌బాజీ, బత్తుల మేరి నిర్మల కుమారి, ద్రాక్షారపు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
భీమవరం : రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ భీమవరంలో అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్ర నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి మావుళ్లమ్మ గుడి మీదుగా అంబేడ్కర్ సెంటర్ వరకూ పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి మాట్లాడుతూ అమరావతిని కొనసాగించాలన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని, అధికారంలోకి వచ్చాక మాటమార్చి మూడు రాజధానులు తెరపైకి తేవడం మోసమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు వేండ్ర శ్రీనివాస్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు గునుపూడి తిరుపాల్, పట్టణ యువత అధ్యక్షుడు మద్దు ల రాము, గంట త్రిమూర్తులు మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నరసాపురం టౌన్ : ముఖ్యమంత్రి జగన్ రాజధాని మార్పు నిర్ణయం ఉపసంహరించుకోవాలని, అప్పటివరకు అమరావతి రైతుల ఉద్యమం ఆగ దని టీడీపీ బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాముడు శ్రీరాములు, పార్లమెంట్ నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు రత్నమాల అన్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా టీడీపీ నాయకులు మోకాళ్ళపై నిలబడి నిరసన ప్రదర్శన చేశారు. రాయపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు నివాసం నుంచి ప్రదర్శన చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతే రాజదాని అన్న ఇప్పుడు అధికారం రాగానే మూడు రాజధానులకు తెరలేపారన్నారు. ఉద్యమిస్తున్న రైతులతో జగన్ ఒక్కసారి కూడా ఎందుకు చర్చకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అమరావతే కావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకన సుబ్రమణ్యం, వాతాడి ఉమా, చిటి కెల రామ్మోహన్, ముత్యాలరావు, భూపతి నరేష్, శశిదేవి, బళ్ళ మూర్తి, మల్లాడి మూర్తి, రెడ్డిం శ్రీను, జగన్, దానియేలు, ఆనందబాబు, పాపారావు, నాట్ర నరేష్, జొన్నల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

వీరవాసరం: అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రాజధాని రైతులకు వీరవాసర ం మండల టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. రరాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానంపై టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానంపై విరుచుకు పడ్డారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చురేపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాశవిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. మూడు రాజదానులు వద్దు. ఒక్క రాజధాని ముద్దు నినాదంతో తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. సీఎస్ ఆర్‌ఐ ఎ.సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. మండల కమిటీ ఉపా ధ్యక్షుడు యరకరాజు గోపాలకృష్ణరాజు, వీరవల్లి చంద్రశేఖర్, రాయపల్లి వెంకట్, చింతా కనకయ్య, తమ్మినీడి నాగేశ్వరరావు, వీరవల్లిసురేష్, గన్నమనీడి జయప్రసాద్, మైగాపుల నాగభూషణం నాయుడు అడిదల చిరంజీవి, పులఖండం జయ, వీరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
