రైతు సమస్యలపై నిలదీస్తే బయటకు పంపేస్తారా

ABN , First Publish Date - 2020-12-02T04:51:18+05:30 IST

రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినం దుకు టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం దారుణమని పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు.

రైతు సమస్యలపై నిలదీస్తే బయటకు పంపేస్తారా
భీమవరంలో ధర్నా చేస్తున్న తెలుగుదేశం నాయకులు

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసన


భీమవరం, డిసెంబరు 1: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినం దుకు టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం దారుణమని పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు. శాసనసభలో రెండు రోజులుగా టీడీపీపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ మంగళవారం నర్సయ్య అగ్రహారం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. మెంటే పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయ బీమా జీవోను అర్ధరాత్రి విడిగా జారీ చేశారని, ఇది మోసపూరితం అన్నారు. టిడ్కో గృహాల విషయంలో కూడా లబ్ధిదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేయకుండా అడ్డుకోవడానికే ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మామిడిశెట్టి ప్రసాద్‌ మాట్లాడుతూ తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ధర్నా కార్యక్రమంలో ఉప్పులూరి చంద్రశేఖర్‌, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, మై లాబత్తుల ఐజాక్‌బాబు, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, ఎద్దు ఏసుపాదం, మరపట్ల శ్యాంబాబు, చెల్లబోయిన గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:51:18+05:30 IST