మంత్రి బాలినేనిని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-07-18T11:38:36+05:30 IST

చెన్నైలో పట్టుబట్టుబడిన కోటా ్లది రూపాయల అక్రమ సొమ్ము వెనుక రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న ..

మంత్రి బాలినేనిని బర్తరఫ్‌ చేయాలి

 టీడీపీ శ్రేణుల డిమాండ్‌


ఏలూరు టూటౌన్‌, జూలై 17 : చెన్నైలో పట్టుబట్టుబడిన కోటా ్లది రూపాయల అక్రమ సొమ్ము వెనుక రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణ జరిపించి బాలినేనిని మంత్రి మండలి నుంచి బర్తరఫ్‌ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిజాయితీని నిరూపించుకోవాలని జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడు తూ  జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై విచారణ జరిపించి నిజా నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకు తెలపాలన్నారు.


వైసీపీ ప్రభుత్వంలో  దళితులపై దాడులపై నిజానిజాలు తేల్చడానికి సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పాల జగ దీశ్‌బాబు, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దాసరి ఆంజనేయులు పాల్గొన్నారు.  


తణుకు : సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని బర్తరఫ్‌ చేసి న్యాయ విచారణ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో పట్టుబడిన బాలినేని అనుచరుల హవాలా సొమ్ముపై సీఎం ఏం సమాధా నం చెబుతారన్నారు. ఒక్కరోజులోనే ఐదున్నర కోట్ల రూపాయలు దొరికితే 14 నెలల నుంచి ఎంత సొమ్ము ఇతర రాష్ర్టాలకు తరలించి ఉంటారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఐదు రూపాయలు దొరక్కపోయినా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈఎస్‌ఐ స్కాంలో ఇరికించిందన్నారు.  


చింతలపూడి : మంత్రి బాలినేనిని బర్తరఫ్‌ చేయాలని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ డాక్టర్‌ కర్రా రాజారావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేయాలని పేర్కొన్నారు.  


దేవరపల్లి : మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో న్యాయమూర్తులకు భద్రత కరువైతే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందన్నారు.


Updated Date - 2020-07-18T11:38:36+05:30 IST