-
-
Home » Andhra Pradesh » West Godavari » tdp house arrest
-
ప్రతిపక్షాలను పోలీసులతో అడ్డుకుంటారా
ABN , First Publish Date - 2020-11-01T04:39:06+05:30 IST
ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానా లపై ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు లేకుండా పోలీసులతో అడ్డుకోవడం దారుణమని టీడీపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నరసాపురం అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఆగ్రహం
భీమవరం, అక్టోబరు 31: ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానా లపై ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు లేకుండా పోలీసులతో అడ్డుకోవడం దారుణమని టీడీపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్‌భరో కార్యక్రమా నికి శనివారం బయల్దేరిన సీతారామలక్ష్మిని భీమవరం టూటౌన్ పోలీసులు అడ్డుకున్నారు. ఇది సరికాదని ఆమె నిరసన తెలిపారు. భూములిచ్చిన రైతులకు సంకెళ్లు వేసి కేసులు పెట్టడం దారుణమన్నారు. జగన్ ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. దొంగతనాలు, హత్యలు, మానభంగం చేసిన నిందితుల మాదిరి రైతులకు బేడీలు వేసి తీసుకువెళ్లడం రాష్ట్రంలో మానవ హక్కులు పూర్తిగా హరించబడుతున్నాయన్నారు. రైతులకు సంకెళ్ళు వేసి తీసుకువెళ్ళడంపై తెలుగుదేశం, జేఏసీలు మూడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం ఛలో గుంటూరు జైలు భోరో కార్యక్రమానికి సంఘీభావంగా ప్రకటిస్తుంటే ఇలా హౌస్ అరెస్టులు చేసి నిర్భంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
భీమవరం నియోజకవర్గ టీడీపీ నేతలను టూటౌన్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హౌస్ అరెస్టులో ఉన్న కోళ్ళ నాగేశ్వరరావు గృహం వద్ద సంఘీభావంగా టీడీపీ నాయకులు ఎద్దు ఏసుపాదం, మైలాబత్తుల ఐజాక్‌బాబు, ఉప్పులూరి చంద్రశేఖర్, గంటా త్రిమూర్తులు, ఈపి శేషు, కోళ్ళ నాగబాబు, ఎర్రంశెట్టి శ్రీనివాస్, కొరిపల్లి శ్రీనివాస్, కోళ్ళ సీతారావ్‌ర, సూరిబాబు, తదితరులు సాయంత్రం వరకు పాల్గొన్నారు. సీనియర్ నేత మెంటే పార్థసారధిని ఆయన నివాసంలో నిర్భంధించారు.
