-
-
Home » Andhra Pradesh » West Godavari » TDP House arest
-
రాష్ట్రంలో అరాచక పాలన : జవహర్
ABN , First Publish Date - 2020-11-01T04:56:55+05:30 IST
రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన సాగిస్తు న్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.

కొవ్వూరు, అక్టోబరు 31:రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన సాగిస్తు న్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లకుండా పట్టణ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్రం లో పోలీసులు రాజ్యాంగాన్ని మరిచి వైసీపీ చట్టాన్ని, వైసీపీ పాలసీని, వైసీపీ నిబంధనలు మాత్రమే అమలు పరుస్తున్నారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ డీజీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.