నరసాపురంలో టీడీపీ క్యాంపు రాజకీయం

ABN , First Publish Date - 2020-03-16T11:43:27+05:30 IST

సాధారణంగా క్యాంపు రాజకీయాలు ఎన్నికల తరువాత జరుగుతుండడం చూస్తూనే ఉంటాం. కానీ అధికార పార్టీ బెదిరింపుల

నరసాపురంలో టీడీపీ క్యాంపు రాజకీయం

వార్డులు ఏకగ్రీవం కాకుండా వ్యూహం

12 మంది కౌన్సిలర్‌ అభ్యర్థుల తరలింపు


నరసాపురం, మార్చి 15 : సాధారణంగా క్యాంపు రాజకీయాలు ఎన్నికల తరువాత జరుగుతుండడం చూస్తూనే ఉంటాం. కానీ అధికార పార్టీ బెదిరింపుల నేపథ్యంలో తమ అభ్యర్థులను పోటీలో నిలుపుకునేందుకు నరసాపురంలో టీడీపీ కొత్త వ్యూహాం పన్నింది. నామినేషన్ల పరిశీలన తరువాత 12 మంది కౌన్సిలర్‌ అభ్యర్థుల్ని శనివారం రాత్రి క్యాంపునకు తరలించింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ తరువాత వీర్ని తీసుకొచ్చే విధంగా ప్లాన్‌ చేసింది. ఈ పరిణామాలను గమనించని వైసీపీ ఖంగు తింది.


నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకోలేకపోయింది. దీంతో మునిసిపాలిటీపై దృష్టి సారించింది. అధికార పార్టీకి చెక్‌ పెట్టేందుకు టీడీపీ, జనసేన లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దానిలో భాగంగా టీడీపీ పోటీ చేసే వార్డుల్లో జనసేన మద్దతు పలుకుతుంది. ఇటు జనసేన దాని మిత్రపక్షం పోటీ చేసే చోట టీడీపీ అండగా నిలుస్తుంది. ఈ విధంగా నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన తరువాత బరిలో 156 మంది అభ్యర్థులు నిలిచారు. అందులో టీడీపీ 51, వైసీపీ 70, జనసేన 15, బీజేపీ 6, కాంగ్రెస్‌ రెండు, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థులు 11 మంది ఉన్నారు. అయితే కొన్ని వార్డుల్లో ఇద్దరు మాత్రమే మిగిలారు. ఇలాంటి వార్డులపై వైసీపీ కన్నేసింది. వీటిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించింది. నామినేషన్ల పరిశీలన తరువాత వేగంగా పావులు కదిపింది. సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకునే విధంగా బెదిరింపులతో పాటు ప్రలోభాలకు వ్యూహరచన చేసింది.


కనీసం ఐదు వార్డులైనా ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన టీడీపీ జాగ్రత్త పడింది. అన్ని వార్డుల్లో ఎన్నికలు జరిగే విధంగా వ్యూహాన్ని రూపొందించింది. దానికి అనుగుణంగా కొందరి అభ్యర్థులను శనివారం రాత్రి క్యాంపునకు తరలించింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ తరువాత వీరిని తీసుకొచ్చే విధంగా ప్లాన్‌ చేసుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన వైసీపీ షాక్‌ తింది. అయితే ఎన్నికలు వాయిదా పడడంతో ఆదివారం మధ్యాహ్నానికి వీరంతా పట్టణానికి చేరుకున్నారు. 

Updated Date - 2020-03-16T11:43:27+05:30 IST