జగన్‌ ప్రభుత్వంపై వైసీపీ నేతలకే నమ్మకం లేదు

ABN , First Publish Date - 2020-11-20T04:39:21+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రజలకు నమ్మకం లేకపోవడమే కాకుండా వైసీపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా నమ్మకం లేదని టీడీపీ ఆర్గ నైజింగ్‌ కార్యదర్శి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు.

జగన్‌ ప్రభుత్వంపై వైసీపీ నేతలకే నమ్మకం లేదు

టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌



పాలకొల్లు అర్బన్‌, నవంబరు 19 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రజలకు నమ్మకం లేకపోవడమే కాకుండా వైసీపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా నమ్మకం లేదని టీడీపీ ఆర్గ నైజింగ్‌ కార్యదర్శి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. ఆయన నివాసం లో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, నాయకుల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. డిప్యూటీ సిఎంగా పనిచేసి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తన సొంత జిల్లా తూర్పుగోదావరిలోని రామచంద్రపురంలో జరిగిన శిరోముండనం కేసు లో దోషులు తప్పించుకోవడానికి చూస్తున్నారని చెప్పారన్నారు. పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ను మార్చాలని చూస్తున్నారని బోస్‌ హోంమంత్రికి లేఖ రాయడాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌ స్పందించి దళితులకు అన్యా యం జరగదని బహిరంగంగా చెప్పాలని అంగర డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలో భూదందా చేస్తున్నవారి పేర్లు బయట పెట్టాలంటూ అధికా ర పార్టీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, అమరేం ద్ర ఎంపి విజయసాయిరెడ్డిని నిలదీ యడం ప్రజలు గుర్తించారన్నారు. భూ దొంగలు ఎవరనేది తేల్చాల్సిన సీఎం జగన్‌ తాడేపల్లిలో పంచాయితీ పెట్ట డం ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నా రని అంగర ప్రశ్నించారు. అమరావతి ఎమ్మెల్యేకు పేకాట ఎమ్మెల్యేగా  ప్రజలు బిరుదు ఇచ్చారన్నారు. రెడ్లు మనన్ని అణగదొక్కేస్తున్నారని, ఎస్సీ, బీసీలు సమైక్యంగా ఉండాలని, ఎంపి నందిగం సురేష్‌ రెడ్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో రెడ్ల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో తేట తెల్లమ వుతోందని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-20T04:39:21+05:30 IST