-
-
Home » Andhra Pradesh » West Godavari » TDP
-
18 నెలలుగా అరాచక పాలన : తోట సీతారామలక్ష్మి
ABN , First Publish Date - 2020-11-28T05:12:46+05:30 IST
రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో పడి 18 నెలలవుతోందని, రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తున్న జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.

భీమవరం, నవంబరు 27 : రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో పడి 18 నెలలవుతోందని, రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తున్న జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియంత పాలనకు పెద్ద కొడుకుగా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ రాజారెడ్డి రాజ్యాం గం అమల్లోకి తెచ్చి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, అంబేద్కర్‌పై ఏ మాత్రం అభిమానం ఉన్నా అమరావతిలో స్మృతి వనం పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వేధింపులు, న్యాయ స్థానాలపై కుల ముద్రలు వేసి దేశంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్కరోజైనా జగన్‌రెడ్డి నడుచుకున్నారేమో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు.