ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం : బడేటి చంటి

ABN , First Publish Date - 2020-11-27T05:00:41+05:30 IST

ప్రభుత్వ పథకాలను హడావుడి గా ప్రకటిస్తూ ఎలా అమలు చేస్తా రనే విషయాన్ని చెప్పకుండా ప్రజల ను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోం దని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం : బడేటి చంటి

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, నవంబరు 26: ప్రభుత్వ పథకాలను హడావుడి గా ప్రకటిస్తూ ఎలా అమలు చేస్తా రనే విషయాన్ని చెప్పకుండా ప్రజల ను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోం దని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. టీడీపీ జిల్లా  కార్యాలయంలో గురువారం విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లా డుతూ జగనన్న తోడు  పథకంలో రుణాలు ఇవ్వాలంటూ బ్యాంకులతో మాట్లాడకుం డా లబ్ధిదారులకు ఎలా ఇప్పిస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చే గృహాల్లో అవినీతి జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ఆరోపించడం తగదన్నారు. వాస్తవానికి 2004 నుంచి 2014 సంవత్సరాల మధ్య నిర్మించిన గృహాల నిర్మాణంలోనే అవినీతి జరిగింద న్నారు. ఆ మధ్య కాలంలో ఒక్కో లబ్ధిదారుడి నుంచి పది వేల రూపాయలు కట్టించుకుని ఇళ్లు ఇవ్వలేదన్నారు. అలాం టి వారిని  గుర్తించి టీడీపీ హయాంలో కొంతమందికి డబ్బులు తిరిగి ఇప్పించార న్నారు. ఎన్టీఆర్‌ గృహాల పేరుతో టిడ్కో నిర్మించిన గృహాలకు లబ్ధిదారులు కట్టాల్సిన రూ.500 కూడా అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి కట్టారన్నారు. టిడ్కో గృహాలు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో  టీడీపీ జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, ఉప్పాల జగదీశ్‌బాబు, అమరావతి అశోక్‌, రెడ్డి నాగరాజు, శ్రీనివాసరావు, రామ్మోహనరావు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-27T05:00:41+05:30 IST