జగనన్న తోడు కాదు.. కబ్జా పథకం : సీతారామలక్ష్మి
ABN , First Publish Date - 2020-11-27T04:59:09+05:30 IST
కేంద్ర ప్రభుత్వ పథకానికి రంగులు మార్చి కబ్జ్జా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రచార ఆర్భాటం చేస్తుందని నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు.

భీమవరం, నవంబరు 26 : కేంద్ర ప్రభుత్వ పథకానికి రంగులు మార్చి కబ్జ్జా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రచార ఆర్భాటం చేస్తుందని నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. లబ్ధిదారుడు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన అప్పుకి ఇంత హంగామా అవసరమా..? అని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధాన మంత్రి స్వనిధి పేరుతో వీధి వ్యాపారులకు ఇచ్చే రూ.10 వేలు రుణానికి సంబంధించి బ్యా ంకు క్లియర్ చేసే ప్రతి దరఖాస్తుకూ కేంద్రం పూచీ ఉంటోందని, రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడం దారుణమన్నారు. రిజర్వు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే జగనన్న తోడుకు రుణాలిచ్చే అవకాశమే లేదనే వాదన కూడా వినిపిస్తోందన్నారు.