తమ్మిలేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2020-11-01T04:59:21+05:30 IST

తమ్మిలేరు ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి ఈనెల 4న ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయ నున్నట్టు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని తెలిపారు.

తమ్మిలేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
సీఎం జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసే తమ్మిలేరు ప్రాంతాన్ని పరిశీలి స్తున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తదితరులు

ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని

ఏలూరు రూరల్‌, అక్టోబరు 31: తమ్మిలేరు ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి ఈనెల 4న ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయ నున్నట్టు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సీఎం శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్‌తో కలిసి పరిశీలించి అధికారులకు  సూచనలు చేశారు. అనంతరం నాని మాట్లాడుతూ తమ్మిలేరుకు వరద వచ్చిన ప్రతిసారి ఏలూరు నగరంతోపాటు పరిసర గ్రా మాలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  దివంగత వైఎస్‌ హయాంలో కొంతవరకూ సమస్యను పరిష్కరించామని ఏడు కిలో మీటర్ల తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకో కుండా నిర్లక్ష్యం చేశాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ముంపు సమస్య శాశ్వత పరిష్కా రానికి రూ.78 కోట్లు  నిధులు కేటాయించారన్నారు. నిర్మాణ పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి వేసవి లోపు పనులు చేసేలా అధికారులను ఆదేశించారు. మాదేపల్లి వరకు ఈ రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణం ఉంటుందన్నారు. సీఎం పర్యటనను పురస్కరిం చుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, ఆయా శాఖ అధికారులు, ఏఎంసీ చైర్మన్‌ మైబాబు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-01T04:59:21+05:30 IST