బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్లు

ABN , First Publish Date - 2020-06-06T10:15:29+05:30 IST

ఇటీవల బదిలీ అయిన తహసీల్దార్లు ఆయా మండలాల్లో శుక్రవారం బాధ్యతలు స్వీక రించారు.

బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్లు

ఆకివీడు / ఇరగవరం / నరసాపురం / పెనుమంట్ర, జూన్‌ 5 : ఇటీవల బదిలీ అయిన తహసీల్దార్లు ఆయా మండలాల్లో శుక్రవారం బాధ్యతలు స్వీక రించారు. ఆకివీడు తహసీల్దార్‌గా జీజే సూర్యకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన కలెక్టరేట్‌ కార్యాలయంలో పర్యవేక్షకుడిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇరగవరం మండల తహసీల్దార్‌గా పి.రాజరాజేశ్వరి శుక్రవారం విధుల్లో చేరారు. పోడూరు నుంచి బదిలీపై ఇరగవరం వచ్చారు. నరసాపురం తహసీల్దార్‌గా వి.మల్లికార్జున రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి బదీలిపై వచ్చారు. పెనుమంట్ర మండల తహ సీల్దార్‌గా వై.దుర్గా కిశోర్‌ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన కేబీ సీతారాం ఉద్యోగ విరమణతో కాళ్ళ నుంచి దుర్గాకిశోర్‌ బదిలీపై వచ్చారు.

Updated Date - 2020-06-06T10:15:29+05:30 IST