కోట సత్తెమ్మ ఆలయ పాలకవర్గం ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2020-08-22T11:00:45+05:30 IST

ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు ట్రస్ట్‌ బోర్డు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు. తిమ్మరాజుపాలెంలోని కోట సత్తె

కోట సత్తెమ్మ ఆలయ పాలకవర్గం ప్రమాణస్వీకారం

నిడదవోలు, ఆగస్టు 21 : ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు ట్రస్ట్‌ బోర్డు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు. తిమ్మరాజుపాలెంలోని కోట సత్తెమ్మ ఆలయ నూతన ట్రస్ట్‌ బోర్డు ప్రమా ణస్వీకార కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. చైర్మన్‌గా దేవులపల్లి రామసుబ్బరాయశాస్ర్తి, ధర్మకర్తలుగా గాజుల రంగారావు, అయినీడి వెంకటకృష్ణ, యాళ్ళ రాఘవులు, ఉర్ల వీర వెంకటలక్ష్మి, కాగిత నాగదేవి, రేలంగి వెంకటలక్ష్మి, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా ఆలయ ప్రధాన అర్చకు లు శివకోటి వెంకట కామేశ్వర అప్పారావు శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఈవో బళ్ల నీలకంఠం, మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.


బీసీల అభివృద్ధే ధ్యేయం

తణుకు, ఆగస్టు 21 : బీసీల అభివృద్ధే ధ్యేయంగా సంఘం పని చేస్తుందని బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్నా శ్రీనివాసు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలాలు, నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

Updated Date - 2020-08-22T11:00:45+05:30 IST