క్వారంటైన్‌లో అనుమానితులు

ABN , First Publish Date - 2020-03-25T10:36:59+05:30 IST

విదేశాల నుంచి వచ్చిన కరోనా అనుమానితుల కోసం తీరుగూడెంలో ప్రత్యేక శిబిరాన్ని

క్వారంటైన్‌లో అనుమానితులు

నిడదవోలు/కొవ్వూరు/పెరవలి రూరల్‌/చాగల్లు, మార్చి 24 : విదేశాల నుంచి వచ్చిన కరోనా అనుమానితుల కోసం తీరుగూడెంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని నిడదవోలు మునిసిపల్‌ కమిషనర్లు కె.వి. పద్మావతి  తెలిపారు.నిడదవోలు పట్టణంలోని తీరుగూడెంలో నిర్మించిన అపార్ట్‌ మెంట్లను మంగళవారం కమిషనర్‌ పరిశీలించారు. నిడదవోలు పరిధిలో 42 మంది విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించామన్నారు.


ఈ నేపథ్యంలో సింగవరం, తీరుగూడెం గ్రామస్థులు ఇక్కడ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేయవద్దని ధర్నా చేయగా వాళ్లంతా అనుమానితులు మాత్రమేనని అధికారులు సర్దిచెప్పారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెరవలి ఎంపీ డీవో విజయలక్ష్మి, ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ సూచించారు. అనవసరంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ ప్రజలను హెచ్చరిస్తున్నారు. క్వారంటైన్‌ ముద్ర ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కొవ్వూరు మునిసిపల్‌ కమిషనర్‌ సుధాకర్‌ హెచ్చరించారు.


కొవ్వూరు పీబీఆర్‌ నగర్‌లో కోరంటైన్‌ సెంటర్‌ సిద్ధం చేశామన్నారు. కొవ్వూరులోని విదేశాల నుంచి వచ్చిన 22 మంది నివాసాలను గుర్తించారు. అత్యవసర మైతే తప్ప బయట సంచరిస్తే కేసు నమోదు చేస్తామని చాగల్లు ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ హెచ్చరించారు. ప్రజలు బయట తిరగకుండా అవగాహన కల్పిస్తున్నారు.

Read more