ఒరిస్సా యువకుడి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-12-03T05:48:37+05:30 IST
భవన నిర్మాణ పనుల కోసం ఒరిస్సా నుంచి వచ్చిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు కుక్కునూరు ఎస్ఐ పైడిబాబు తెలిపారు.

కుక్కునూరు, డిసెంబరు 2: భవన నిర్మాణ పనుల కోసం ఒరిస్సా నుంచి వచ్చిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు కుక్కునూరు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. ఒరిస్సాకు చెందిన శివరామ్దాస్ (22) కొద్ది రోజుల క్రితం కుక్కునూరు గ్రామానికి పనుల నిమిత్తం వచ్చాడు. అతనితో పాటు మరో యువకుడు కలిసి స్థానికంగా పోలవరం కాలనీ నిర్మాణాల్లోను, స్థానికంగా నిర్మిస్తున్న భవనాల్లోను హెల్పర్లుగా పని చేస్తున్నారు. ఐదు రోజులుగా వీరు పనికి రాకపోవడంతో తోటివారు వీరు ఊరికి వెళ్లిపోయారని భావించారు. అయితే కుక్కునూరులో కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఓ భవనం వెనుక పొదల్లో శివరామ్దాస్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో యువకుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఎస్ఐ తెలిపారు.