బాలిక అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-12-20T05:50:21+05:30 IST

పట్టణంలోని పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలిక అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందింది.

బాలిక అనుమానాస్పద మృతి


 జంగారెడ్డిగూడెం టౌన్‌, డిసెంబరు 19: పట్టణంలోని పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలిక అనుమానాస్పద స్థితిలో శనివారం  రాత్రి మృతి చెందింది. కె.సుష్మ (11) అనే బాలిక కుటుంబ కలహాల కారణంగా ఉరేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తండ్రి గతంలో చనిపోగా తల్లి ఉంది. డీఎస్పీ రవికిరణ్‌ ఘటనా స్థలిని సందర్శించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2020-12-20T05:50:21+05:30 IST