-
-
Home » Andhra Pradesh » West Godavari » suicide at akividu west godavari dist
-
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
ABN , First Publish Date - 2020-12-11T05:14:05+05:30 IST
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆకివీడు మండలం పెదకాప వరంలో జరిగింది.

ఆకివీడు, డిసెంబరు 10:ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆకివీడు మండలం పెదకాప వరంలో జరిగింది. గ్రామంలో వేగేశ్న వెంకట్రాజు చేపల చెరువుపై బద్దా పవన్ కుమార్ (19) పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిం చగా పెద్దలు ఒప్పుకోకుండా వేరే వ్యక్తితో పెళ్లి చేయడంతో బుధవారం పురుగుల మందు ట్యాబ్లెట్లు మింగేశాడు. కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో పాటు, మృతుడు చిన్నాన్న నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రైటర్ జయరాజు తెలిపారు.