బకాయిల బాధ వచ్చేస్తోంది!

ABN , First Publish Date - 2020-08-16T10:15:07+05:30 IST

మారటోరి యం గడువు ముంచుకొస్తుంది. కరోనా నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) ఆరు నెలల పాటు రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం అ

బకాయిల బాధ వచ్చేస్తోంది!

15 రోజుల్లో ముగియనున్న మారటోరియం గడువు

గడువు పెంచకుంటే సెప్టెంబర్‌ నుంచే ఈఎంఐల భారం 

జిల్లాలో మొత్తం రుణాలు రూ.15 వేల కోట్లు

డిసెంబరు నెలాఖరు వరకూ పెంచుతారనే ఆశ


పాలకొల్లు, ఆగస్టు 15 : మారటోరి యం గడువు ముంచుకొస్తుంది. కరోనా నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) ఆరు నెలల పాటు రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం అన్ని వర్గాల ప్రజలకూ ఊరటనిచ్చింది. తొలుత జూన్‌ నెల వరకూ మూడు నెలలు మారటో రియం ఇవ్వగా దానిని మరో మూడు నెలలు పొడిగించి ఆగస్టు వరకూ అవ కాశం ఇచ్చారు. ఇప్పుడు మరో 15 రోజు ల్లో ఆ గడువు ముగుస్తుంది. రిజర్వ్‌ బ్యాంకు మరో దఫా మారటోరియం గడువు పెంచుతుందని రుణ గ్రహీతలు ఆశిస్తున్నారు.


అయితే ఇప్పటి వరకూ మారటోరియం గడువు పెంచే విషయమై రిజర్వ్‌ బ్యాంకు నుంచి నిర్థిష్టమైన ఆదేశాలు వెలువ డలేదు. గడచిన ఐదు నెలల్లో వర్తక, వాణిజ్యాలు పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులకూ జీతాల్లో కోత పడడంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న పౌరులు ఇప్పుడు నెలవారీ కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడు తున్నారు. ఆర్థిక విపత్తుల నుంచి బయటపడడానికి ఏడాది కాలం పడుతుందని ఆర్థిక రంగ నిపుణుల అంచనా వేస్తున్నారు.


ఈఎంఐ లపై మరో దఫా మారటోరిుం ఇవ్వకుంటే వేల సంఖ్యలో రుణఖాతాలు ఎన్‌పీఏ(నాన్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎసెట్స్‌)లోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తున్నది. జిల్లాలో 42,605 మంది రూ. 4,169.78 కోట్లు గృహ రుణాలు తీసుకున్నారు. విద్యా రుణాలపై 9,446 మంది రూ. 461.38 కోట్లు తీసుకున్నారు. వాహన, ఇతర రుణాలకు 2,10,008 మంది రూ. 6,189.14 కోట్లు పొందారు.  ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) రుణాల నిమిత్తం 1,14,768 ఖాతాలు రూ.3,599.97 కోట్లు రుణం పొందాయి. వ్యవసాయ, బంగారంపై రుణాలు మినహా మిగిలిన రుణాలు జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా పౌరులు సుమారు రూ. 15 వేల కోట్లు లబ్ధి పొందారు.


అర్హత కలిగిన రుణ గ్రహీతలే ఈ వెసులుబాటు వినియోగించుకోవాలని ఆర్‌బీఐ సూచించినప్పటికీ సుమారు 90 శాతం మంది ఈఎంఐలను మారటో రియం పరిధిలోకి తెచ్చుకున్నారు. ఈఎంఐలు చెల్లించే స్థోమత ఉన్న రుణ గ్రహీతలు ఎప్పటి మాదిరిగా ఈఎంఐలు చెలిస్తు న్నారు. ఇలా మూడు నెలలు మినహాయింపు పొందిన రుణగ్ర హీతల సిబిల్‌ స్కోర్‌ తగ్గించమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 

Updated Date - 2020-08-16T10:15:07+05:30 IST