ప్రేమ పెళ్లి చేసుకున్న మూడు నెలలకే..

ABN , First Publish Date - 2020-12-08T04:06:18+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడు నెలలకే ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రేమ పెళ్లి చేసుకున్న మూడు నెలలకే..
యువకుడు రమేశ్‌

పెనుగొండ, డిసెంబరు 7 : ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడు నెలలకే ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనుగొండ గుబ్బలవారివీధిలో నివాసం ఉంటున్న గంగవరపు రమేశ్‌ (23) ఆదివారం సాయంత్రం తన ఇంటిలో ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఉరి వేసుకోవడానికి గల కారణాలు  తెలియరాలేదు. రమేశ్‌ మూడు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకోవడం జరిగిందని ఇంతలో  ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చిందోనని బంధువులు వాపోతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హెచ్‌సీ వి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 


Updated Date - 2020-12-08T04:06:18+05:30 IST