-
-
Home » Andhra Pradesh » West Godavari » Sub Collector Visiting
-
‘విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు’
ABN , First Publish Date - 2020-11-28T05:13:41+05:30 IST
సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథ్ తెలిపారు.

యలమంచిలి, నవంబరు 27 : సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథ్ తెలిపారు. వైవీలంక, కలగంపూడి, చించినాడ, యలమంచిలి, మేడపాడు గ్రామ సచివాలయాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలకు బాధ్యులైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్ ఎల్. నరసింహరావు, ఎంపీడీవో జి.రాజేంద్ర ప్రసాద్‌లకు సూచించారు.