-
-
Home » Andhra Pradesh » West Godavari » Student
-
జిప్మర్ విద్యా వైద్య సంస్థలో అఖిలకు సీటు
ABN , First Publish Date - 2020-12-10T06:31:11+05:30 IST
ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాలలో వల్లూరుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాలూరి రామకృష్ణ కుమార్తె అఖిలకు 720 మార్కులకు గానూ 667 మార్కులతో జాతీయ స్థాయి 102వ ర్యాంక్ సాధించి పాండిచ్ఛేరి రాష్ట్రంలోని విద్యా వైద్య సంస్థ జిప్మర్‌లో సీటు సాధించింది.

పెంటపాడు, డిసెంబరు 9 : ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాలలో వల్లూరుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాలూరి రామకృష్ణ కుమార్తె అఖిలకు 720 మార్కులకు గానూ 667 మార్కులతో జాతీయ స్థాయి 102వ ర్యాంక్ సాధించి పాండిచ్ఛేరి రాష్ట్రంలోని విద్యా వైద్య సంస్థ జిప్మర్‌లో సీటు సాధించింది. మొదటి కౌన్సెలింగ్‌లో మంగళగిరి ఎయిమ్స్‌లో సీటు సాధించి రెండో కౌన్సెలింగ్‌లో జిప్మర్‌ను ఎంచుకుంది. చిన్ననాటి నుంచే అఖిల చదువులో ప్రతిభను చాటుతుందని తల్లిదండ్రులు రామకృష్ణ, శైలజ దంపతులు తెలిపారు. విద్యార్థిని అఖిల మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణతో చదివితే వాటిని సాధించవచ్చని తెలిపింది. ఇంటర్ వరుకూ వేలివెన్ను శశి కళాశాలలో చదివిన తనకు డైరెక్టర్ బూరుగుపల్లి రవి, ఉపాధ్యా యులు మార్గదర్శకం చేశారని పేర్కొంది.